– ధ్రువ్ జురెల్, యశ్ దయాల్ సైతం
ముంబయి : భారత టెస్టు జట్టుకు ఎంపికైన యువ క్రికెటర్లు సర్ఫరాజ్ ఖాన్, యశ్ దయాల్, ధ్రువ్ జురెల్‌లు నేటి నుంచి ఆరంభం కానున్న ఇరానీ కప్‌లో పోటీపడనున్నారు. కాన్పూర్ టెస్టులో భారత తుది జట్టులో ఈ ముగ్గురు యువ క్రికెటర్లకు చోటు దక్కలేదు. నాలుగు రోజుల పాటు జట్టుతో ఉన్న ఈ క్రికెటర్లను ఇరానీ కప్ కోసం విడుదల చేస్తూ బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. లక్నోలోని ఎకానె స్టేడియంలో నేటి నుంచి ఇరానీ కప్ జరుగనుంది. ముంబయితో రెస్టాఫ్ ఇండియా పోటీపడనుంది. సర్ఫరాజ్ ఖాన్ ముంబయి తరఫున ఆడనుండగా.. అజింక్య రహానె కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. రెస్టాఫ్ ఇండియాకు రుతురాజ్ గైక్వాడ్ సారథ్యం వహిస్తున్నాడు. ధ్రువ్ జురెల్, యశ్ దయాల్‌లు రెస్టాఫ్ ఇండియా తరఫున బరిలోకి దిగుతున్నారు.