కేసు పల్లి గ్రామపంచాయతీలో పింఛన్ పంపిణీ చేస్తున్న సర్పంచ్

నవతెలంగాణ-జక్రాన్ పల్లి

మండలంలోని కేసుపల్లి గ్రామపంచాయతీలో సర్పంచ్ మహేశ్వర్ పింఛన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేసు వెళ్లి సర్పంచ్ మహేశ్వరి మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా ఇంటర్నెట్ సౌకర్యం గ్రామపంచాయతీలో సక్రమంగా రానందున గ్రామంలోని చెరువు కట్ట దగ్గర ఉన్న శ్రీ శివ కేశవ నాథ మందిరం వద్ద పోస్ట్ మాన్ వెళ్లి అక్కడ వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ డబ్బులు పంపిణీ చేసే వారిని, వికలాంగుల వృద్ధుల ఇబ్బందులను చూసి గ్రామపంచాయతీలో సరైన స్థలంలో ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించి శనివారం నుంచి గ్రామపంచాయతీ లోనే పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తున్నామని సర్పంచ్ మహేశ్వర్ తెలిపారు.