మృతుని కుటుంబానికి బియ్యం అందజేస్తున్న సర్పంచ్

నవతెలంగాణ – మంథని: జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ మనస్సు ఎంతో గొప్పదని ఖానాపూర్ సర్పంచ్ పుట్ట వెంకటమ్మ-రామయ్య, కొనియాడారు. సోమవారం మంథని మండలంలోని ఖానాపూర్ గ్రామంలో మదికట్ల నారాయణ ఇటీవల మృతి చెందగా ఆయన కుటుంబానికి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ బాసటగా నిలుస్తూ1క్వింటాల్ బియ్యం మృతుని కుటుంబానికి సర్పంచ్ వెంకటమ్మ-రామయ్య ఆధ్వర్యంలో స్వయంగా వారి ఇంటికి వెళ్లి మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలకు భరోసానిచ్చే నాయకుడు మనకు కావాలని,అలాంటి నాయకుడే జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు. జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ను వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మంథని ఎమ్మెల్యేగా ఘనంగా గెలిపించవలసిన బాధ్యత కార్యకర్తలపైన ఉందని వారు గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు అమ్మకుంటి మల్లేష్,ఉప సర్పంచ్ మంతిని మల్లేష్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు,నాయకులు బిరుదు లచ్చన్న,దాసరి ధర్మేందర్,తదితరులు పాల్గొన్నారు.