రెంజల్ మండల కేంద్రంలోని బందల్ల ర్రోడ్డు పనులను పరిశీలించిన సర్పంచ్..

నవతెలంగాణ- రెంజల్
రెంజల్ మండల కేంద్రంలో బందల రోడ్డు పనులను సర్పంచ్ ఎమ్మెస్ రమేష్ కుమార్ గురువారం పరిశీలించారు. ఈ రోడ్డు పనులను స్థానిక పిఆర్ఏఈ వినయ్ కుమార్, సారాధ్యంలో కొలతలు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రోడ్డు పనులు చురుకుగా కొనసాగుతున్నాయని, మొరం పనులు యుద్ధ ప్రాతికపైన చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పనులకు స్థానిక రైతులు తమ సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు..