నవతెలంగాణ-రామగిరి:
రామగిరి మండలంలోని బేగంపేట గ్రామ ప్రజలు,భవాని ఆలయ కమిటీ సభ్యుల కోరిక మేరకు ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ వారికి దుర్గామాత విగ్రహాన్ని అందించిన లొంక కేసారం సర్పంచ్ ఎండి మంజూర్ .హిందువులు తమ ఆరాధ్య దైవంగా కొలుచుకునే దేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని బేగంపేట గ్రామ ప్రజలు గ్రామ పంచాయతీ వద్ద ప్రతి సంవత్సరం దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా భవాని యూత్ సభ్యులు మాట్లాడుతూ, మత సామరస్యానికి నిదర్శనంగా, కులమతాలకు అతీతంగా కొన్ని సంవత్సరాలుగా వారికి భవాని మాతా విగ్రహాన్ని బహుకరిస్తున్న లొంక కేసారం సర్పంచ్ ఎండి మంజూరు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.