
గాంధారి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఈరోజు జరిగిన కంటి వైద్య శిబిరంని గాంధారి సర్పంచ్ మమ్మాయి, సంజీవ్ యాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సంజీవ్ యాదవ్ మాట్లాడుతూ ఇప్పటినుండి ప్రతి మంగళవారం గాంధారి ప్రభుత్వ ఆస్పత్రిలో కంటి పరీక్షలు చేపడతారని అలాగే మోతిబిందు సమస్య ఉన్న వారిని గుర్తించి లయన్స్ క్లబ్ బోధన్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా కంటికి సంబంధించిన ఆపరేషన్లు చేయించ బడుతాయని ఈ అవకాశాన్ని గాంధారి మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.