సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ప్రజల ఆరోగ్యానికి ఆసరా సర్పంచ్ సురేష్

నవతెలంగాణ- మద్నూర్
ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ప్రజల ఆరోగ్యానికి ఎంతో ఆసరాగా నిలుస్తుందని ప్రజలు అనారోగ్యాల పాలై ఆస్పత్రుల్లో చికిత్సల నిమిత్తం ఖర్చులు పెట్టిన డబ్బులు సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ద్వారా ఇప్పించడం జరుగుతుందని గ్రామ సర్పంచ్ సురేష్ తెలిపారుస్ప గ్రామంలోని ఎల్లమ్మ గల్లీకి చెందిన లబ్ధిదారునికి 29500 మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును సోమవారం నాడు అందజేశారు. ఈ చెక్కు అందజేత కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బన్సీ పటేల్ రైతు సమన్వయ సమితి కన్వీనర్ కంచిన్ హనుమాన్లు గ్రామ సర్పంచ్ వార్డ్  సభ్యుల కుటుంబీకులు సాయి తదితరులు పాల్గొన్నారు.