
మండలంలోని నాగల్ గావ్ గ్రామములో గ్రామ సర్పంచ్ గ్రామానికి చెందిన పలువురికి నూతనంగా మంజూరైన ఆసర పెన్షన్ ను మంగళ వారం పంపిణి చేసారని జేపిఎస్ హరిష్ తెలిపారు. ఈసంధర్భంగా సర్పంచ్ కపిల్ పటేల్ మాట్లాడుతు ఇటివలే భర్త చనిపోవడంతో అతనికి వచ్చే పెన్షన్ అర్హులైన భార్యకు రెండు వేల నూట పదహరు రూపాయలను మంగళవారం అందించడం జర్గిందని సర్పంచ్ పేర్కోన్నారు. కార్యక్రమంలో సర్పంచ్, జేపిఎస్, లబ్దిదారులు తదితరులు పాల్గోన్నారు.