
రెంజల్ మండలం బాగేపల్లి గ్రామంలో బుధవారం సిసి డ్రైనేజీ పనులను సర్పంచ్ పాముల సాయిలు ప్రారంభించారు. 15 ఆర్థిక సంఘం నిధుల నుంచి రెండు లక్షల రూపాయలు మంజూరు కావడంతో అట్టి నిధులతో ఇందిరమ్మ కాలంలో 80 మీటర్లు, బాగేపల్లి గ్రామపంచాయతీ ముందు 20 మీటర్ల సిసి డ్రైనేజీ పనులను ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి శ్రీకాంత్, గ్రామస్తులు పాల్గొన్నారు..