సత్యహరి చంద్రుడు కాటికాపరి విగ్రహా దాత కు ఘన సన్మానం..

నవతెలంగాణ – డిచ్ పల్లి
సత్యహరి చంద్రుడు కాటికాపరి విగ్రహాన్ని, ఐదు బెంచీలను మండలంలోని సుద్దపల్లి గ్రామం లోని వైకుంఠ ధామంకు అందజేసిన డిచ్ పల్లి మాజీ ఎంపీపీ, దాత కంచెట్టి గంగాధర్ కు శుక్రవారం సర్పంచ్ పానుగంటి రూపా సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో  ఘన సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పానుగంటి రూపా సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. డిచ్ పల్లి మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్ గ్రామంలోని వైకుంఠ దామంలో సత్యహరి చంద్రుడు కాటికాపరి విగ్రహాన్ని, ఐదు బెంచీలు అందజేయడం అభినందన మన్నారు.విగ్రాహ దాత చేతుల మీద ఆవిష్కరించాడం జరిగిందని తెలిపారు. వైకుంఠ ధామం లో ఏలాంటి లోటు, పాట్లు లేకుండా కృషి చేస్తామని రూపా సతీష్ రెడ్డి వివరించారు. ఈ విషయాన్ని తెలిపిన వేంటనే ముందుకు వచ్చి విగ్రహాం,బెంచిలు అందజేయడం తో ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఎంబడి సంతోషం, విగ్రహ  గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు రెడ్డి నరహరి, సొసైటీ వైస్ చైర్మన్ గంగారం, సాయిలు, వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.