– ఆరోగ్యం ఎట్లుందే..
నవతెలంగాణ-వీణవంక
వీణవంక మండల కేంద్రం నుండి జమ్మికుంట వైపు వెళ్తున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి నర్సింగాపూర్ బస్టాండ్ సమీపంలోని గద్దె మీద గ్రామానికి చెందిన వృద్ధులు సావడి ముచ్చట్లు పెట్టుకుంటూ ఆదివారం సాయంత్రం కనిపించారు. వారిని గమనించిన కౌశిక్ రెడ్డి వెంటనే వారి వద్దకు వెళ్లి తాతా.. బాగున్నవానే.. ఆరోగ్యం ఎట్లుందే.. పింఛన్ వస్తుందా అంటూ పలుకరించారు. సీఎం కేసీఆర్ పంపించే పింఛన్ డబ్బులతో దవాఖాన ఖర్చులు, మందులు సరిపడా వస్తున్నయానే అంటూ ఆప్యాయంగా వారితో మాట్లాడారు. మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటానంటూ తనను ఆశీర్వదించాలని కోరారు.