నవతెలంగాణ బొమ్మలరామారం: మహిళల జీవితాలలో వెలుగులు నింపిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని ప్రధానోపాధ్యాయురాలు పి.నిర్మల జ్యోతి అన్నారు. మండలంలోని మర్యాల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం సావిత్రి భాయి పూలె జయంతి సందర్బంగా పాఠశాలలో విద్యార్థులతో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. మహిళలకు విద్యను అందించటానికి ఎంతగానో కృషి చేసి మహిళల జీవితాలలో వెలుగులు నింపారని మహిళలకు విద్యను అందించటానికి పాఠశాలను ఏర్పాటు చేసి ఎన్నో వివక్షలను ఎదుర్కొని మహిళల అభ్యున్నతికి కృషి చేసిన చదువుల తల్లిని స్మరించుకోవడం చాల గొప్ప విషయమని మహిళలు సావిత్రి భాయి పూలే అడుగుజడలో నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస చారి, ముఖీత్, సైదులు, ముబీన్, బాలసుబ్రహ్మణ్యం, చంద్రమౌళి, జహంగీర్, యామిని, విజయలక్ష్మి, భవాని, విద్యార్థులు పాల్గొన్నారు.