ఆదర్శమూర్తి సావిత్రిబాయి పూలే

నవతెలంగాణ – కోటగిరి

కోటగిరి మండల కేంద్రంలో మంగళవారం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా కోటగిరి అంబేద్కర్ చౌరస్తాలో సావిత్రిబాయి పూలే దంపతుల చిత్రపటానికి పూలమాలలు అర్పించి జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా మాల మహానాడు మండల అధ్యక్షులు మిర్జాపూర్ సాయన్న మాట్లాడుతూ మహిళలకు మొట్టమొదటిగా పాఠశాల నెలకొల్పి ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలిచిన ఆదర్శమూర్తి మహాత్మ జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి పూలే అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బర్ల మధు, బేగరి రాములు, సాయిలు,జీవన్  తదితరులు పాల్గొన్నారు.