సే నో టు డ్రగ్స్‌..

ఆర్థికంగా ఉండి, పబ్బులకు వెళ్లేవాళ్లు కొకైన్‌, హెరాయిన్‌, ఓపీయం, ఎల్‌ఎస్‌డీ వంటి ద్రావణాలను తీసుకుంటున్నారు. ఆవేశంతోనో, ఆనందం కోసమో మొదలవుతున్న ఈ అలవాటు క్రమంగా వ్యసనంగా మారుతోంది. ఆ తర్వాత వారి భవిష్యత్‌నే కబళిస్తోంది. వారి జీవితాలను పాడుచేసుకోవడమే కాదు… మత్తులో వాహనాలు నడిపి ఇతరుల మరణానికీ కారణమవుతున్నారు. చాలా ఘటనల్లో పిల్లలు డ్రగ్స్‌కు అలవాటు పడడానికి స్నేహితులు, తల్లిదండ్రులే కారణమవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. మాదక ద్రవ్యాల కోసం యువత చిన్నచిన్న చోరీల నుంచి హత్యలు చేయడానికి, ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా వెనుకాడటం లేదు. ఇటీవలి కాలంలో నగరంలో పెరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వీరంతా 35ఏండ్లలోపు వారే. మధ్య తరగతి యువతీ, యువకులు ఎక్కువగా డ్రగ్స్‌కు అలవాటు చేసుకుంటున్నారు. చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే డ్రగ్స్‌ వికృత కోరల నుంచి యువతను కాపాడుకోవచ్చు.