
ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షులుగాపోటా ల మల్లేష్ ను నియమించినట్లు కమిటీ హుజురాబాద్ డివిజన్ అధ్యక్షుడు తూర్పాటి లింగయ్య తెలిపారు. శనివారం మండల కేంద్రంలోఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు సిరిపాటి వేణు, హుజురాబాద్ డివిజన్ అధ్యక్షుడు తూర్పాటి లింగయ్య ఆధ్వర్యంలో శనివారం ఉప కులాలకు చెందిన వారితో సమావేశం నిర్వహించారు. నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. జమ్మికుంట మండల ప్రధాన కార్యదర్శిగా గడ్డం లింగయ్య , ఉపాధ్యక్షులుగా బాణాల వెంకటేష్ , రేపెల్లి వెంకటేష్, వారణాసి జాన్ , రేకేంద్ర ప్రశాంత్ లను ఏకగ్రీవంగా నియమించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తూర్పాటి లింగయ్య మాట్లాడారు. ఎస్సి ఉప కులాలకు ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలను అందజేయాలని, నియోజకవర్గంలోని ఎస్సీ ఉపకులాల్లోని నిరుపేదలందరికీ డబుల్ బెడ్ రూములు అందజేసి ,ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో చింతల అంజి, సతీష్ వర్మ, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.