
మమడలంలోని బిజ్జల్ వాడీ జీపీ లో రూపాయలు ఐదు లక్షల వ్యయం తో స్థానిక ఎమ్మెలే హన్మంత్ షిండే కృషి సహకారంతో మంజూరు చేసారని శనివారం నాడు గ్రామ సర్పంచ్ గౌళే యాదవ్ నిర్మాణం చేపడుతున్న స్లాబ్ పరీశీలించడం జర్గిందని జేపిఎస్ దివ్య తెలిపారు. ఈ సంధర్భంగా సర్పంచ్ జీ.యాదవ్ మాట్లాడుతు నిర్మాణ పనులను పటిష్టంగా నాణ్యతగా చేయాలని గుత్తేదారునికి ఆదేశించారు. పనులు త్వరలో పూర్తీ అవుతాయని, వచ్చే నేలాఖరు వరకు ప్రారంబించుకుంటామని ఆశాబావం వ్యక్తం చేసారు. సర్పంచ్ తో పాటు జీపీపాలకవర్గం సబ్యులు, గ్రామస్తులు హన్మంత్ పటేల్, మాదారావ్ పటేల్, తదితరులు పాల్గోన్నారు.