ఎస్సీ కార్పొరేషన్ చెక్కు పంపిణీ..

నవతెలంగాణ- రెంజల్
రెంజల్ మండలం సాటాపూర్ గ్రామంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వచ్చిన 50 వేల రూపాయల చెక్కును స్థానిక సర్పంచి వికార్ పాషా లబ్ధిదారు రాలు పసుల కావేరికి అందజేశారు. చెక్కు ఇవ్వడానికి సహకరించిన సీఎం కేసీఆర్, బోధన్ ఎమ్మెల్యే మొహమ్మద్ షకీల్ ఆమీర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలకు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు హాజీ ఖాన్, గ్రామ అధ్యక్షులు భూమేష్, కే. సాయిలు, జి సంతోష్, తదితరులు పాల్గొన్నారు..