ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఏకం కావాలి

– బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌చార్జి నర్మద కిష్టప్ప
నవతెలంగాణ-కొడంగల్‌
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఏకం కావాలని బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌ చార్జి నర్మద కిష్టప్ప అన్నారు. దుద్యాల మండలం హకీంపేట్‌ బీఎస్‌పి గ్రామ కమిటీని దుద్యాల మండలాధ్యక్షులు ఉష్ణచారి అధ్యక్షతన ఎన్నుకున్నారు. కా ర్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ నర్మద కిష్టప్ప హాజరై మాట్లాడుతూ ఏ ఒక వర్గానికో, కులానికో సంబంధించిన పార్టీ కాదని బహుజనుల పార్టీ అని ఆర్‌ఎస్‌ ప్రేమ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో నిలిజెండా ఎగర వేయాలన్నారు. గ్రామస్థాయిలో పార్టీని ప్రతిష్టం చేయాలన్నారు. జనాభా దా మాషా ప్రకారం చట్టసభల్లో ప్రాతినిధ్యం రాకపోవడం దురదృష్టకరమన్నా రు. హకీంపేట్‌ నూతనఅధ్యక్షులుగా నడిమింటి వెంకటయ్య, ఉపాధ్యక్షులు ఈశ్వర్‌, ప్రధాన కార్యదర్శి వరప్రసాద్‌, ప్రధాన కార్యదర్శులు రాహుల్‌, బాల కృష్ణ, శివకుమార్‌, శ్రీనివాస్‌, శ్రీశైలం, మూర్తి, శ్రీకాంత్‌, అంజి, మోహన్‌, అం జిలయ్య, కృష్ణలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో తాలూకా అ ధ్యక్షులు కురువ సాయిలప్ప, తాలూకా కార్యదర్శులు చంద్రశేఖర్‌, సత్యమ్మ తదితరులు పాల్గొన్నారు.