మొరం మాఫియాపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు

నవతెలంగాణ – మాక్లూర్ : మండలంలోని మాదాపూర్ గ్రామంలో  దామ రాజేశ్వర ఫిర్యాదు పై పోలీస్ స్టేషన్ యందు ఎస్సీ, ఎస్టీ కేసు ఆదివారం  నమోదు చేసినట్లు ఎస్సై సుదీర్ రావు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం దామా రాజేశ్వర్ మాదాపూర్ గ్రామంలో మొరం అక్రమంగా రవాణా చేస్తున్నారంటు జిల్లా  కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా అట్టి ఫిర్యాదు గురించి తెలిసిన సదరు వ్యక్తులు నితిన్, చరణ్, సునీల్ రావు, వెంకట్, లక్ష్మణ్, లోకేష్, నరేందర్, రవి, రమేష్ కలిసి  ధామ రాజేశ్వర్ ను ఒరేయ్ మాలోడ అంటూ కులం పేరుతో వారింటికి వెళ్లి దూషించడం వల్ల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.