ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ దేశవ్యాప్తంగా అమలు చేయాలి

– తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్రాములు
ఆత్మకూర్‌: ఎస్సీ,ఎస్టీ సబ్‌ ప్లాన్‌ దేశవ్యాప్త అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్రాములు అన్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాల జనరల్‌ బాడీ సమావేశం వనపర్తి జిల్లా ఉపాధ్యక్షులు యస్‌.అజరు అధ్యక్షత శుక్రవారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్‌.వెంకట్‌ రాములు, జిల్లా సీనియర్‌ నాయకులు మహి మూద్‌ లు ప్రసం గిస్తూ, అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో జరిగే శాసనసభ ఎన్నికల సందర్భంలో తమ తమ ఎన్నికల మేనిఫెస్టోలో వ్యవసాయ కార్మికు లకు కూలి రేట్లు పెంచుతామని 1948 చట్టం అమలు చేస్తామని హమీ నిచ్చారని గుర్తుచేశారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పెరుగు తున్న నిత్యవసర వస్తువుల ధరలకు సమానంగా కూలి రేట్లు పెంచాలన్నారు. ఉపాధి హామీలో ప్రతికూలికి ఏడాదికి 200 పని దినాలు కల్పించడంతోపాటు, రోజు కూలి 600 చెల్లిస్తామని రాష్ట్రంలోనూ అన్ని మున్సిపాలిటీలలో ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరిస్తామని అన్ని రాజకీయ పార్టీలు ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇవ్వాలన్నారు. భూమిలేని కూలీలకు కూలి బంధు పథకం కూడా తెస్తామని మేనిఫెస్టోలో చేర్చుతామని అధికారంలోకి వచ్చినాక అమలు చేస్తామని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేయాలన్నారు. రాజ్యాంగం రిజర్వేషన్లుు- ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణు- సామాజిక న్యాయం, ఎస్సీ ఎస్టీ సబ్‌ ప్లాన్‌ దేశవ్యాప్త అమలు కొరకు ఈనెల 15న హైదరా బాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగు దళిత సమ్మిట్‌ లో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో సంఘం వనపర్తి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్‌.రాజు,మేకల ఆంజ నేయులు. మహబూబ్‌ నగర్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జగన్‌. కడియాల మోహన్‌, జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ప్రభుదాస్‌, రేపల్లె దేవదాస్‌. తదితరులు పాల్గొన్నారు.