నవతెలంగాణ- కంటేశ్వర్
నిజామాబాద్ లో గల ఎస్సీ స్టడీ సర్కిల్ లో 5 నెలల పాటు గ్రూప్స్, బ్యాంకింగ్, కేంద్ర ప్రభుత్వ పోటీ పరీక్షలకు ఇవ్వబడే ఉచిత నివాసిత కోచింగ్ కు గాను నిర్వహించిన అర్హత పరీక్ష ఫలితాలను శుక్రవారం నాడు విడుదల చేసినట్లు ఎస్సీ సంక్షేమశాఖ అధికారిణి శశికళ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్ష వ్రాసినవారు వెబ్సైట్ www.tsstudycicle.co.in ద్వారా చూసుకుని, ఎంపికైన వారు ఈనెల 29,30,31వ తేదీల్లో వారు పొందిన సమాచారం ప్రకారం అన్ని సర్టిఫికెట్లను ఎస్సీ స్టడీ సర్కిల్ లో సమర్పించి అడ్మిషన్లు పొందాలని డైరెక్టర్, విజయకుమార్ సూచించారు.