మహిళలహక్కులపై విజ్ఞాన సదస్సు

నవతెలంగాణ-భువనగిరి
పట్టణంలోని సీడీపీఓ కార్యాలయంలో అంగన్వాడీ ఉపాధ్యాయులకు వివిద చట్టాలలో స్త్రీలకు గల హక్కులపై, పారాలీగల్‌ వాలంటీర్ల విధి విధానాలపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ పారాలీగల్‌ వాలంటీర్లుగా సేవలందించి నిరక్షరాస్యులకు, పేదవారికి, అర్హులైన అందరికీ న్యాయ సహాయం న్యాయసేవా సంస్థల ద్వారా అందేలా చేయాలని సూచించారు.ప్రతిఒక్కరూ భాద్యతాయుతంగా రాజ్యాంగబద్ధంగా నడుచుకునేటట్లు చూడాలని తెలిపారు.సీడీపీఓ స్వరాజ్యం,సూపర్‌వైజర్లు, అంగన్వాడీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.తదుపరి న్యాయమూర్తి రైతువేదికలో నిర్వహిస్తున్న వ్యవసాయ న్యాయసలహా కేంద్రాన్ని సందర్శించి, రైతు వేదికలో ఉన్న రైతులకు వ్యయసాయ చట్టాలపై అవగాహన కల్పించారు. రైతులకు ఏర్పాటు చేసిన న్యాయ సహాయకేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధిóకార సంస్థ అధికారిక షార్ట్‌ ఫిలిమ్‌ దర్శకులు,సలహాదారు సాయిప్రసాద్‌ పాల్గొన్నారు.