విజృంభిస్తున్న సీజనల్‌ వ్యాధులు

– గ్రామాల్లో పెరుగుతున్న డెంగీ, మలేరియా – పల్లెల్లో లోపించిన పారిశుధ్యం – పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-నరసింహులపేట
మండల వ్యాప్తంగా పల్లెలు తండాలు జ్వరాల బారిన పడుతున్నాయి. మండలంలోని అన్ని గ్రామాలలో తండాలలో ప్రజలు జ్వరాలతో బాధ ప డుతున్నారు. గ్రామంలో రోడ్ల పక్కన పెంటకుప్పల వలన చెత్తాచెదారం పేరుకుపోయింది. పారిశుధ్యం నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో విష జ్వరాలు దాడి చేస్తున్నాయి. టైఫాయిడ్‌, మలేరియా వ్యాధులతో ఆస్పత్రుల కు వెళ్లాల్సి వస్తోంది. వైద్యాధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. అన్ని గ్రామాల పరిస్థితే ఇదే. జలుబు, దగ్గు, జ్వ రం తదితర లక్షణాలతో ప్రవేట్‌ ఆస్పత్రుల్లో ఓపీ సంఖ్య పెరుగుతోంది. ప్ర భుత్వ ఆస్పత్రికి సీజనల్‌ వ్యాధుల చికిత్స కోసం వస్తున్న వారే ఎక్కువ. మం డలంలోని వివిధ పట్టణాల్లోని పీహెచ్‌సీలు, ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా ఓ పీ సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే డెంగీ, మలేరియా కేసులు నమోదయ్యా యి. ఇవి మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి డెంగీ వైరస్‌లో మార్పులు జరుగుతాయని, ఈసారి డెంగీ కేసులు కొంత ఆందోళన కలిగించే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. సీజ నల్‌ వ్యాధులతో ఆస్పత్రికి వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. 10 రోజుల కిందటి వరకు రోజూ 500 నుంచి 650 మంది వచ్చేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 1,400 వరకు పెరిగిందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడు చాలా పీహెచ్‌సీల్లో వైద్యులు, సిబ్బంది కొరత కూడా వేధిస్తోంది. ఇప్పటికైనా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే సీజనల్‌ వ్యాధులను నియంత్రించవచ్చు. సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు పంచాయతీల్లో చేస్తు న్న పనులు శూన్యమనే చెప్పాలి. దోమల నివారణ కోసం బ్లీచింగ్‌ చల్లడం, ఫాగింగ్‌ వంటివి కూడా చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. మేజర్‌ పంచాయతీల్లో సైతం ఇదే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పం దించి గ్రామాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని మండల ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. మండలంలోని పకీర తండా, లోక్య తండా, మధు తండా, అజ్మీర తండా, దుబ్బ తండ, తండవాసులు మా తండాకు వైద్య అ ధికారులు ఇంతవరకువరకు రాలేదు తండవాసులు, సరిత, మమత అం టున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తండాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని తండవాసులు కోరుతున్నారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మోహన్‌ మాట్లాడుతూ గ్రామాలలో తండాలలో జ్వరాలు వస్తుం టే కన్నెత్తి చూడడం లేదని అధికారులు మాత్రం ఏ మాత్రం పట్టించుకో వడం వలన ప్రజలు విశ్వ జ్వరాలు డెంగ్యూ మలేరియా జరాలు వచ్చి, ఖమ్మం, వరంగల్‌, తొర్రూర్‌, మహబూబాబాద్‌, ప్రైవేట్‌ హాస్పిటల్లో పోయి వేల రూపాయలు ఖర్చు అవుతుందని మండల ప్రజలు అంటున్నారు. గ్రామాలలో కనీసం వైద్య శిబిరం ఎక్కడ ఏర్పాటు చేయలేదని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వైద్య అధికారులు స్పందించి గ్రామాలు తండాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : డాక్టర్‌ చైతన్య
గ్రామాలలో జ్వరాలు వస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏదైనా ఇబ్బందులు వస్తే దంతాలపల్లి గవర్న మెంట్‌ హాస్పిటల్‌కు మండల ప్రజలు రా వాలని ఆమె కోరారు. గ్రామాల్లో కూడా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి జ్వరాలు త దితర టెస్టులు చేసి ఉచిత మందులు పం పిణీ చేస్తున్నట్లు కొన్ని గ్రామాలలో కూడా టెస్టులు చేసి ప్రజలకు సుమారు 200 మందికి మందులు ఉచితంగా పంపిణీ చేసినట్లు దంతాలపల్లి డాక్టర్‌ చైతన్య తెలిపారు.