– ఐఐటీ-ఢిల్లీ ఫెస్ట్‌లో షాకింగ్ ఘటన
ఢిల్లీ : ఐఐటీ-ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఫెస్ట్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థినుల వాష్ రూంలో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసినట్టు బాధితులు ఫిర్యాదు చేశారు. ఫెస్ట్‌లో భాగంగా ఓ ఫ్యాషన్ షో నిర్వహించారు. ఇందులో పాల్గొనేందుకు వచ్చిన భారతి కళాశాల విద్యార్థినులు దుస్తులు మార్చుకునేందుకు వినియోగించిన వాష్‌రూంలో రహస్య కెమెరాలతో చిత్రీకరణ జరిగింది. ఈ మేరకు వారు ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఘటనాక్రమాన్ని వివరిస్తూ బాధితులు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిపై తాము ఫిర్యాదు చేసినా ఐఐటీ-ఢిల్లీ యాజమాన్యం పట్టించుకోలేదని విచారం వ్యక్తం చేశారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓ కాంట్రాక్ట్ స్వీపర్‌ను (20) అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.