మాకేం ఇస్తానని కార్డ్ లు కాదు చూపడం
మీరేం పుచ్చు కుంటారో ముందే చెప్పండి
మీరు వెలగ పెట్టే ప్రజా సేవ కు
మీ ఆదాయం ఎన్ని రేట్లు పెంచుకుంటారో ప్రకటించండి
మాది మాకు పంచి ఇవ్వడానికి
మీరు తీసుకునే శాలరీ ఎంత పెంచు కుంటారో
ఐదు సంవత్సరాల పనికే పెన్షన్ తీసుకుంటే
అరవై సంవత్సరాలకు వుద్యోగుల కు ఎంత పెన్షన్ రావాలి
మాకు గజాలు ఇవ్వడం డబల్ బెడ్ రూమ్ సరే
మీరు ఎన్ని %టaతీఎ ష్ట్రశీబరవ% లతో సరి పెట్టు కుంటారు
ప్రభుత్వ జాగాలు అప్పనంగా కట్ట బెట్టి
దుబారు బుర్జు లో ఎన్ని ఫ్లాట్ లు పొందుతారు
ఉచిత ప్రయాణం అతి వలు ఆడగ లేదు
రోడ్డు లు నడుము విరగ గొట్ట కుంటే చాలు
సమయానికి డ్రైవర్, కండక్టర్ కు జీతాలు
సరిగ్గా పడితే బస్ సంతోషంగా గమ్యం చేరు తుంది
మీరు ఎన్ని కార్ ల కాన్వాయి లో వూరేగు తారో
ఎంత మంది పోలీస్ లను మీ వెంట తిప్పు తారో నెలవారీ ఖర్చు ఎన్ని కోట్లు ఎవరి ఖాతా నొ చెప్పండి
దర్జాలకు దుబారాలకు మ్యానిఫెస్టో లో ముందే పెట్టండి
బాగు చేయడం దేవుడు ఎరుగు
రేట్లు పెంచి బట్టలు వూడకుంటే చాలు
బందు పథకాలు తెచ్చి పాలోని తో పగ పెంచి
బతుకులు బుగ్గి పాలు కాకుంటే చాలు
మా గురించి ఏడ్చేది అంతా
మీ ఆస్తులు పెంచు కోవడానికే
కార్డ్ లు అన్ని కనికట్టు చేసి
మీ బంధు గనం ఆస్తులు మాత్రమే పెరుగు తాయి
బినామీ సామ్రాజ్యం తో మరో పదేళ్ల కు పక్కా ప్లాన్
ప్రజలు ఎప్పుడూ
పెనం మీది నుంచి పొయ్యి లోకి
నాయకులు తర తరాల గా
పెత్తనం చేసి ఆస్తులు పెంచు కోవడానికి
పార్టీలు జెండాలు మాత్రమే మారుతాయి
మిగితా అంతా సేం సేం షేమ్ షేమ్ …..
అసలు మీ సీక్రెట్ మానిఫెస్టో
అర్థం కాని జనం అందలం ఎక్కించి
ఖర్మ తో సరి పెట్టు కోవడం షరా మామూలే
ప్రజాస్వామ్యం ను నిలబెట్ట డానికి
బారులు తీరి ఓటర్ ఓడి పోతాడు ఎల్లప్పుడూ….
– దాసరి మోహన్, 9985309080