
రెంజల్ మండలంలోని 17 గ్రామ పంచాయతీల పరిధిలో ఆదివారం గ్రామ కార్యదర్శిలు సర్వే జరిపారు. కార్యదర్శులు ఉదయం నుంచి ఆయా గ్రామాలలో ఇంటింటికి వెళ్లి సర్వే జరిపారు. రెంజల్ మండలంలో 2352, దరఖాస్తులు రాగా ఆదివారం రోజున 2080 పూర్తి అయ్యాయని ఎంపీ ఓ గౌస్ ఉద్దీన్ పేర్కొన్నారు. మండలంలోని నీల గ్రామంలో సుమారు 650 దరఖాస్తులు రాగా, మరో 270 వరకు దరఖాస్తులు సర్వే జరపాలసి ఉందని ఆయన తెలిపారు..