– బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ-భూపాలపల్లి టౌన్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివద్ధి, సంక్షేమ పథ కాలను చూసి ఓటు వేయాలని భూపాలపల్లి బీఆర్‌ఎస్ ఎమ్మె ల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం భూపాలపల్లి మండలం ఎస్‌ఎం కొత్తపల్లి, భూపాలపల్లి మున్సి పల్ 30వ వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడ పగడప తిరుగుతూ ఓటర్లతో ముచ్చటించారు. గ్రామ సెం టర్లలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడు తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమానికి పెద్దపీట వేసి రైతుబంధు, రైతు భీమా లాంటి పథకాల ప్రవేశపెట్టి దేశంలో ఎక్కడలేని విధంగా రైతులకు 24 గంటల ఉచిత కరెం టు ఇచ్చాడని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ కరెంటు కష్టాలు తప్పవని, కర్ణాటకలో ఇప్పటికే కరెంటు లేక రైతులు ధర్నా, రాస్తారోకోలు చేస్తున్నారని వివరించారు. భూపాలపల్లి నియోజకవ ర్గాన్ని ప్రభుత్వ సహకారంతో మౌలిక వసతుల కల్పనకు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తు న్నామని అన్నారు. ఈ అభివద్ధి కొనసాగాలంటే రాష్ట్రంలో కేసీఆర్, భూపాలపల్లిలో తనను అధిక మెజార్టీతో గెలిపించా లని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ కల్లెపు శోభ రఘుపతిరావు, ఎంపీపీ మందల లావణ్య విద్యా సాగర్‌రెడ్డి, ఎంపీటీసీ తరాల నరసింగం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్‌గౌడ్ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్ధన్, 30వ వార్డ్ కౌన్సిలర్ మాడ కమల, భారత జాగతి జిల్లా అధ్యక్షుడు మాడ హరీష్ రెడ్డి పాల్గొన్నారు.