నార్లాపూర్ లో ఘనంగా సీత్ల భవాని పండుగ

నవతెలంగాణ- తాడ్వాయి
గిరిజనులు ప్రతి ఏటా పెద్దపుశాల కార్తిలో నిర్వహించుకునే సీత్ల భవాని పండుగను మండలంలోని నార్లాపూర్ లంబాడీలు భక్తి శ్రద్ధలతో మంగళవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ పొలిమేర వద్ద గిరిజనుల ఆరాధ్య దైవాలను ఏడుగురిని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు. డప్పు చప్పులతో యువతులు మహిళలు చిన్నారులు నృత్యాలు చేసుకుంటూ దేవతల వద్దకు సమూహంగా వెళ్లి నైవేద్యాలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని ప్రజలు పశుపక్షాదులు ఆరోగ్యంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, గిరిజన మహిళలు యువతులు, సీత్ల భవానికి ధూప, దీప, నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు ధారావత్ దేవా నాయక్ మాట్లాడుతూ సీత్ల భవాని పండుగ ప్రపంచం మొత్తంలో నివసిస్తున్న గిరిజన, లంబాడీల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలిచే పండుగ అన్నారు. ఈ
 కార్యక్రమంలో నార్లాపూర్ ఉపసర్పంచ్ అజ్మీర రతన్ సింగ్, టిడిపి నియోజకవర్గస్థాయి నాయకులు ధారావత్ దేవా నాయక్, మంగులాల్, గిరిజన మహిళలు, తండా పెద్దలు తదితరులు పాల్గొన్నారు.