నూతన వధువు- వరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సీతక్క

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని ముత్తాపూర్ గ్రామానికి చెందిన వట్టం సమ్మక్క గౌరయ్య కుమారుడు రామ్మూర్తి వివాహానికి శనివారం ములుగు ఎమ్మెల్యే సీతక్క హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లితో వధూవరులు నిండు నూరేళ్లు పిల్లాపాపలతో సుఖ సంతోషాలతో కలకాలం వర్ధిల్లాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్, మండల యూత్ అధ్యక్షులు చింత క్రాంతి, గ్రామ అధ్యక్షులు కుంజ శ్రీను స్థానిక ప్రజలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love