ఎక్సైజ్ దాడుల్లో గంజాయి పట్టివేత

 నవతెలంగాణ భీంగల్.: భీంగల్ ఎక్సైజ్ సీఐ వేణు మాధవ్ ఆధ్వర్యంలో ఇందల్వాయి రైల్వే స్టేషన్ లో దాడులు నిర్వహించి 70గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిజామాబాద్‌లో ఎండు గంజాయి విక్రయిస్తున్న అర్సపల్లికి చెందిన షేక్ హుస్సేన్ ను పట్టుకొని అరెస్టు చేసి అతని వద్ద నుండి 470 గ్రాములు అతని ఇంట్లో 70 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు. అనంతరం విచారణ చేపట్టగా మహారాష్ట్రలోని నాందేడ్ నుండి తక్కువ పరిమాణంలో గంజాయిని క్రమం తప్పకుండా కొనుగోలు చేస్తు, రైలులో ప్రయాణించి చిన్న ప్యాకెట్లను తయారు చేసి విక్రయిస్తున్నట్లు వెల్లడించినట్లు సీఐ తెలిపారు. ఈ దాడులలో హెడ్ కానిస్టేబుల్ ఫయాజ్, కానిస్టేబుల్ దత్తాద్రిలు ఉన్నారు.