నవతెలంగాణ- భీంగల్: మండలంలోని సికింద్రా పూర్ గ్రామంలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం దాడులు నిర్వహించి అక్రమమద్యాన్ని పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తున్నారని సమాచారం మేరకు దాడులు నిర్వహించగా భూక్య తిరుపతి, షేక్ హుస్సేన్ లు అక్రమంగా మద్యం విక్రయిస్తు పట్టుబడ్డారని వీరి నుండి 68 వేల రూపాయల విలువగల 56 లీటర్ల ఐ ఎం ఎల్, 21. లీటర్ల బీర్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ ఫోర్స్ మెంట్ సీఐ స్వప్న తెలిపారు. ఈ దాడులలో ఎన్ ఫోర్స్ మెంట్ ఎస్సై రామ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్, రాజన్న, కానిస్టేబుల్ లు అవినాష్ ,గంగారంల లాలు ఉన్నారు.