నవతెలంగాణ-కమ్మర్ పల్లి : మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం వాహనాల తనిఖీల్లో భాగంగా రూ.5 లక్షల 40వేలు సీజ్ చేసినట్లు కమ్మర్ పల్లి ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. ఆయన తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి…. రానున్న జనరల్ ఎలక్షన్స్ దృష్ట్యా మండలంలోని టీవీఎస్ షోరూం వద్ద ఎస్సై ఆధ్వర్యంలో కమ్మర్ పల్లి పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తున్నారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి దగ్గర రూ.5 లక్షల 40వేలు పట్టుబడినట్లు తెలిపారు. సదరు వ్యక్తిని విచారించాగా పట్టుబడిన డబ్బులకి సంబందించిన ఎలాంటి పత్రాలు అతని వద్ద లేవన్నారు. పట్టుకున్న డబ్బులను పంచనామా ద్వారా సీజ్ చేసి, అట్టి డబ్బులను ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వారికి తగిన చర్యలకు నిమిత్తం అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు.