జాతీయ స్థాయి వాలీబాల్‌ పోటీలకు ఎంపిక

నవతెలంగాణ-కుల్కచర్ల
కుల్కచర్ల మండలం ముజాహిద్పూర్‌ గ్రామంలోని ఆదర్శ పాఠశాలకు చెందిన అఖిల జాతీయస్థాయి వాలీబాల్‌ పోటీలకు ఎంపికైంది. ఈ నెల 24న వరంగల్లోని ఏకశిలా మైదానంలో జరిగిన వాలీబాల్‌ పోటీలలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. ప్రభుత్వ మోడల్‌ స్కూల్‌ విద్యార్థిని జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల ప్రిన్సిపల్‌ భాగ్యలక్ష్మి, పీఈటీ కష్ణారెడ్డి, ఉపాధ్యాయ బందం విద్యార్థినిని అభినందించారు.