– అడిషనల్ కలెక్టర్ వెంకన్న
నవతెలంగాణ-ఏటూరు నాగారం ఐటిడిఏ
ములుగు జిల్లా వ్యాప్తంగా దళిత బంధు పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ సమగ్ర సర్వే నిర్వహించి అర్హులైన లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థలు వెంకన్న అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాల వారిగా మంజూరైన లబ్ధిదారుల వివరాలు సర్వే చేస్తున్న క్రమంలో శనివారం ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం మండల కేంద్రంలో గల ఆరో వార్డులో స్థానిక గ్రామపంచాయతీ అధికారులు దళిత బందు అర్హులైన లబ్ధిదారుల వివరాలు ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహిస్తుండడంతో అకస్మాత్తుగా ములుగు అడిషనల్ కలెక్టర్ పరిశీలించారు సర్వే నిర్వహణ తీరు పూర్తి వివరాలు సేకరించారు. అధికారులకు పలు సూచనలు సలహాలు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సంధ్యారాణి. జూనియర్ అసిస్టెంట్ గంపల శంకర్. గ్రామ పంచాయతీ కార్యదర్శి రమాదేవి. బిల్ కలెక్టర్లు సర్వ వెంకన్న. లక్ష్మణ్. సిబ్బంది రాంబాబు. తదితరులు పాల్గొన్నారు.