జాతీయస్థాయి పోటీలకు గురుకుల విద్యార్థిని ఎంపిక

నవతెలంగాణ-కాజీపేట
జాతీయస్థాయిలో జరుగుతున్న37వ జాతీయ జూడో క్రీడలలో కాజీపేట మండ లం మడికొండ తెలంగాణ సాంఘిక సం క్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళా శాలలో జూడో అకాడమీలో శిక్షణ పొందు తున్న ఇంటర్మీడియట్‌ రెండవ సంవత్స రం విద్యార్థిని కే.అనూష ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థిని కళాశాల ప్రిన్సి పాల్‌, హనుమకొండ డీసీవో డి.ఉమామహేశ్వరి అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గోవాలో నవంబర్‌ 4 నుండి 9వ తేదీ వరకు జరుగుతున్న జాతీయ స్థాయి క్రీడలో గురుకుల కళా శాల విద్యార్థి పాల్గొనడం ఎంతో గర్వంగా ఉందన్నారు. పోటీలో పాల్గొంటున్న అనూషను, జూడో కో చ్‌ నాగరాజు,పిడి జి.పద్మ, పిఇటి జె.సరితలను వరంగల్‌ ఆర్‌సీవో ఎస్‌.విద్యారాణి అభినందించారు.