సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు కన్నప్ప మృతి..

నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలోని వాగొడ్డుగూడెం కు చెందిన సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు,మండల కమిటీ సభ్యులు కంజా మురళి తండ్రి కన్నప్ప(85) గురువారం అనారోగ్యంతో తన స్వగృహంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పుల్లయ్య,జిల్లా కమిటీ సభ్యులు చిరంజీవి,మండల కమిటీ సభ్యులు గంగరాజు లు వాగొడ్డుగూడెం చేరుకుని కన్నప్ప భౌతికకాయం పై పార్టీ పతాకాన్ని ఉంచి నివాళులు అర్పించారు.వినిమయ సంస్క్రుతి రాజ్యం ఏలుతున్న ప్రస్తుతం తరుణంలో ప్రాణం పోయే వరకు కమ్యూనిస్టుగా జీవించడం గర్వించదగ్గ విషయం అని అన్నారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.