సేవా కార్యక్రమాలకు రాజకీయాలతో సంబంధం లేదు

–  పీఎంఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో సామాజిక సేవలు
– రినీష్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరంతరం సేవా కార్యక్రమాలు
అ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి
నవతెలంగాణ-తాండూరు
పీఎంఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కా ర్యక్రమాలకు రాజకీయాలతో సంబంధంలేదని ఉమ డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం రినీష్‌రెడ్డి ఆధ్వ ర్యంలో తాండూరులో వేల బైక్‌లతో భారీ ర్యాలీ నిర్వ హించి పీఎంఆర్‌ క్రికెట్‌ టోర్నీ నియోజకవర్గ విజేత లకు ఆవార్డులు, ప్రైజ్‌ మనీ అందజేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పట్నం మ హేందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. తన కుమారుడు రినీ ష్‌రెడ్డి రాజకీయాలు చేయడం లేదని, యువతకు ఉ ద్యోగ కల్పన కల్పించడంతో పాటు వారికి అన్ని విధా ల చేయూత అందిస్తున్నాడన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా అనేక ఆటపోటీలు నిర్వహిస్తామ న్నా రు. సెప్టెంబర్‌, అక్టోబర్‌లో భారీ స్థాయిలో సామూహిక వివాహాలు పీఎంఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. తాను గతంలో ఎమ్మెల్యేగా తాండూరులో జాతీ య స్థాయి వాలీబాల్‌ టోర్నీ నిర్వహించి నట్లు గర్తుచేశారు. తమ కుటుంబానికి క్రీడలంటే మక్కు వని, అందుకే తమ సోద రుడు రాజేందర్‌రెడ్డి పేరున అనేక టోర్న మెంట్స్‌ నిర్వహించి యువతను క్రీడల్లో ప్రోత్సహిం చినట్లు తెలిపారు.
యువతే దేశానికి వెన్నుముక
యువతరమే దేశానికి వెన్నుముక అని పట్నం రినీష్‌రెడ్డి అన్నారు. యువతను అన్ని రంగాల్లో రాణిం చేల ప్రోత్సహిస్తామన్నారు. రాబోయే కాలంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతామన్నారు. కార్యక్రమం లో రాష్ట్ర విద్యుఉ పాధి మైళిక వసతుల మాజీ చైర్మన్‌ నాగేందర్‌గౌడ్‌, మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం, మున్సి పల్‌ చైర్‌పర్సన్‌ స్వప్నపరిమల్‌, సీనియర్‌ బీఆర్‌ఎస్‌ నాయకులు కరణం పురుషోత్తంరావు, రావూఫ్‌, మి ర్యాణం శ్రీనివాస్‌రెడ్డి, నారాయణరెడ్డి, అజరు ప్రసా ద్‌, సిద్రాల శ్రీనివాస్‌, కౌలన్సీలర్లు అబ్దుల్‌ రజా క్‌, నీరజ బాల్‌ రెడ్డి, శోభ రాణి, బోయ రవిరాజు, ప్రవీణ్‌ గౌడ్‌, నాయకులు బాల్‌ రెడ్డి, నర్సిం లు,యువత భారీగా పాల్గొన్నారు.