సౌండ్‌ పార్టీ షూటింగ్‌ పూర్తి

ఫుల్‌ మూన్‌ మీడియా ప్రొడక్షన్స్‌ పతాకంపై వి.జె.సన్నీ హీరోగా, హ్రితిక శ్రీనివాస్‌ హీరోయిన్‌గా తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న చిత్రం ‘సౌండ్‌ పార్టీ’. దర్శకుడు జయశంకర్‌ సమర్పణలో సంజరు శేరి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బుధవారంతో ఈ సినిమా షూటింగ్‌ విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా సారథి స్టూడియోలో ఈ చిత్ర టైటిల్‌ లోగో పోస్టర్‌ను జర్నలిస్ట్‌ల చేతుల మీదుగా ఆవిష్కరించారు.
చిత్ర సమర్పకుడు వి.జయశంకర్‌ మాట్లాడుతూ, ‘నిర్మాత రవి, నేను మంచి ఫ్రెండ్స్‌.
నా చిరకాల మిత్రుడైన సంజరుతో ఆయన ఈ సినిమా చేస్తున్నారు. పక్కా ప్లానింగ్‌తో దర్శకుడు సంజరు సినిమాని పూర్తి చేశాడు. అనుకున్న విధంగానే ఆగస్ట్‌లో సినిమాను గ్రాండ్‌గా రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం’ అని అన్నారు. ’25 కంటే ఎక్కువ స్క్రిప్ట్‌లను జాగ్రత్తగా పరిశీలిం చిన తర్వాత, ప్రతిభావంతుడైన సంజరు శేరీతో ఈ సినిమా చేశాం. ఈ అద్భుతమైన ప్రయాణంలో నా ప్రియ మిత్రుడు జయశంకర్‌ మార్గదర్శకత్వం, సపోర్ట్‌ లభించడం నా అదష్టం. ఈ సినిమా షూటింగ్‌ని కేవలం 25 రోజుల్లోనే పూర్తి చేశాం’ అని ఫుల్‌ మూన్‌ మీడియా ప్రొడక్షన్స్‌ అధినేత, నిర్మాత రవి పోలిశెట్టి చెప్పారు. దర్శకుడు సంజరు శేరి మాట్లాడుతూ, ‘ఇదొక ఫుల్‌ ఫన్‌ రైడ్‌ చిత్రం. అందరి సహకారంతో సినిమా చాలా బాగా వచ్చింది’ అని తెలిపారు. ‘నేను పార్టీ పెట్టబోతున్నా అంటూ చేసిన వీడియోకు చాలా మంది నుంచి ఫోన్స్‌ వచ్చాయి. ‘సౌండ్‌ పార్టీ’ టైటిల్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. మా నిర్మాత యుఎస్‌లో ఉంటూ కూడా ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా సినిమా పూర్తి చేయడానికి సహకరించారు. మా దర్శకుడు సంజరు అద్భుతంగా తీశాడు. జయశంకర్‌ అన్నీ తానై సినిమాను నడిపించాడు. కచ్చితంగా థియేటర్‌లో ఈ సినిమా గట్టిగా సౌండ్‌ చేస్తుందని నమ్ముతున్నా. నా కెరీర్‌కి బాగా ఉపయోగపడే చిత్రమిది’ అని అన్నారు.

Spread the love