
మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయానికి వచ్చిన గృహలక్ష్మి దరఖస్తుదరుల కోసం స్థానిక తహశీల్దార్ శంకర్ టెంటు ఏర్పాటు బుదవారం చేశారు. ఈ సందర్భంగా దరఖాస్తు దారులు సంతోషాన్ని వ్యక్తం చేసి గృహలక్ష్మి కోసం దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తు దారులు రెండు రోజులు మాత్రమే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. సమయాన్ని పెంచితే బాగుంటుందని కోరుతున్నారు. చాలా మంది కుల ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అవి రావడానికి సమయం పడుతుందని, కాబట్టి అందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరారు.