బస్సు వేళల బోర్డుల ఏర్పాటు

నవతెలంగాణ- కమ్మర్ పల్లి :

మండలంలోని బషీరాబాద్ లో  గ్రామ పంచాయతీ సమీపంలో ఆర్టీసీ బస్సు వేళల బోర్డులను గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆదేశానుసారం, ఆర్టీసీ అధికారుల సూచనలు మేరకు గ్రామంలో ఈ బస్సు వేళా బోర్డులను ఏర్పాటు చేసినట్లు గ్రామ సర్పంచ్ సక్కారం అశోక్  తెలిపారు. గ్రామస్తుల సౌకర్యం గ్రామం మీదుగా భీంగల్ వెళ్లేందుకు, అదేవిధంగా గ్రామం మీదుగా జగిత్యాల జిల్లా మెట్ పల్లి వెళ్లేందుకు వీలుగా బస్సులు వచ్చే సమయాన్ని చూచిస్తూ బోర్డులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బస్సు సమయ  బోర్డులను ఏర్పాటు చేయడం వల్ల గ్రామం నుండి ప్రయాణం సాగించే ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు. బస్సుల కోసం గంటల తరబడి బస్టాండ్ లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, సమయం ప్రకారం బస్టాండ్ కు చేరుకుంటే బస్సు ప్రయాణాలు సాగించేందుకు అనుకూలంగా ఉంటుందన్నారు. గ్రామంలో పంచాయతీ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సు వేళల బోర్డులను ఏర్పాటు చేయడం పట్ల గ్రామస్తులు  వర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.