– దోషులను కఠినంగా శిక్షించాలి : పీఓడబ్ల్యూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్ 3
మణిపూర్‌లో ఆదివాసి మహిళలపై అత్యంత పాశవికంగా లైంగిక దాడికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని ప్రగతి శీల మహిళా సంఘం(పీఓడబ్ల్యూ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి ఝాన్సీ, అందె మంగ శుక్రవవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.గత మూడు నెల్లుగా మణిపూర్‌లో మారణ హోమం జరుగుతున్నదని తెలిపారు. 2002 గుజరాత్ మారణ హోమాన్ని గుర్తు చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండ్లపై దాడులు, కూల్చివేయడం, హత్యలు, సామూహిక లైంగిక దాడులు, ప్రార్థనాస్థలాల కూల్చివేత జరుగుతున్నా కేంద్రం పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నదని విమర్శించారు. ‘మోడీ మాట్లాడండి. మాట్లాడండ’ి. అంటూ కుకీ మహిళలు అభ్యర్థించినా ప్రదాని నోరు మెదపటం లేదని తెలిపారు. చివరకు సుప్రీం కోర్టు జోక్యంతో మోడీ మౌనం వీడారని ఆవేదన వ్యక్తం చేశారు