
– ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి దమెర కిరణ్ డిమాండ్
నవతెలంగాణ – కంటేశ్వర్
విద్యాశాఖకు మంత్రిని కేటాయించాలి అని, రాజకీయలకు అతీతంగా యూనివర్సిటీల వైస్ ఛాన్స్లర్లను నియమించారు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి దమెర కిరణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) 23వ జిల్లా మహాసభలు స్థానిక నాందేవ్వాడలోని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో అట్టహాసంగా నిర్వహించడం జరిగింది. ఈ జిల్లా మహాసభలకు ముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన మొదలై మూడు నెలలు కావస్తున్న ఇప్పటివరకు విద్యాశాఖకు మంత్రిని కేటాయించకపోవడం దారుణమని అన్నారు. భవిష్యత్తులో అకాడమిక్ ఇయర్ ప్రారంభం అవుతున్న విద్యారంగం సమస్యలపై పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర యూనివర్సిటీలకు రాజకీయాలకు అతీతంగా యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్లను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయాలని అన్నారు. ప్రభుత్వ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం పౌష్టిక ఆహారాన్ని అందించేటట్టుగా పెరిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలను పెంచాలని ప్రభుత్వానికి హితవు పలికారు. అదేవిధంగా రాష్ట్రంలో నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో బిల్లును పెట్టాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. నూతన జాతీయ విద్యా విధానంతో విద్యార్థులకు అత్యంత తీరని అన్యాయం చేస్తున్న బిజెపి సర్కార్ ని విద్యార్థులంతా రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ 23వ జిల్లా మహాసభలలో నూతన జిల్లా కమిటీ 15 మందితో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఎస్ఎఫ్ఐ నూతన జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా పోషమైన మహేష్, రాచకొండ విగ్నేష్ లు ఎన్నిక కావడం కావడం జరిగింది. జిల్లా ఆఫీస్ బేరర్లుగా సిద్ధల నాగరాజు, దీపిక, ప్రసాద్ జిల్లా కమిటీ సభ్యులుగా సంధ్యారెడ్డి, గణేష్, జవహర్, ముత్యం, వాణి, బాపూరావ్, శివ, అభిషేక్ ల ను ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో దినేష్, వరదరాజ్, శివ తదితర నాయకులు పాల్గొన్నారు.