సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ రాస్తో రోఖో 

నవతెలంగాణ -గోవిందరావుపేట
విద్యా రంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని గురువారం మండలంలోని పసర చౌరస్తాలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టిఎల్ రవి మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న పాఠ్య పుస్తకాలను తక్షణమే పంపిణీ చేయాలని విద్యార్థులకు రెండు జతల యూనిఫాం అందించాలని ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలని అదేవిధంగా మధ్యాహ్న భోజనానికి అధిక నిధులు కేటాయించాలని అన్ని ప్రభుత్వ బడులను మన ఊరు మనబడి పథకం కింద పాఠశాల అభివృద్ధి చేయాలి. పెరిగిన ధరలకు అనుకూలంగా మిస్ కాస్మోటిక్ చార్జీలు  పెంచాలని అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో  త్రాగునీరు, బాత్రూములు సమస్యలను పరిష్కరించాలని అన్నారు. సమస్యల తక్షణ పరిష్కారం కొరకై రాస్తారోకో  చేయడం జరిగిందన్నారు. ఇప్పటికైనా అధికారుల స్పందించి విద్యార్థుల సమస్య పరిష్కరించాలని  డిమాండ్ చేశారు. లేనియెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మరిన్ని ఆందోళన  పోరాటాలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు గుగులోత్ రమేష్, వి.సిద్దు, జీవన్, గణేష్, పాణి, శివ, రాకేష్, ముష్రాఫ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.