
రాజన్న సిరిసిల్ల జిల్లా, వీర్నపల్లి మండల కేంద్రం లో బుధవారం మండల స్థాయి ఎస్ జి ఎఫ్ అండర్ 14, అండర్ 17 కబడ్డీ వాలీబాల్ ఖో-ఖో పోటీలు మోడల్ స్కూల్ మైదానంలో సర్పంచ్ పాటి దినకర్ ఎంపిటిసి అరుణ్ కుమార్ , సెస్ డైరెక్టర్ మల్లేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు మండల స్థాయిలో ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయికి ఎంపిక అవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విశ్వనాధం వ్యాయామ ఉపాధ్యాయులు అక్బర్, ప్రతాప్ ,సుజాత లు ఉన్నారు.