షష్టిపూర్తి కలాలకు నేడు సత్కారం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, భాషా సాంస్కృతిక శాఖ సంయుక్తాధ్వర్యంలో గురువారం షష్టిపూర్తి కలాలలకు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మాతృవందనం పేరిట హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్‌ కళా మందిరంలో ఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో ఈ ఏడాదికిగాను 31 మంది తల్లులను సత్కరించనున్నారు.