– అసమ్మతి నేతల మూకుమ్మడి రాజీనామాకు సిద్ధం
నవతెలంగాణ-తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని రంగాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోగల వీరాపూర్ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ మండల ఉపాధ్యక్షులు పెనక విశ్వనాథం, పీఏసీఎస్ మాజీ డైరెక్టర్ జవ్వాజి మల్లయ్య, మండల కమిటీ సభ్యులు తోలెం కాంతా రావు, బీఆర్‌ఎస్ గ్రామ కమిటీల మాజీ అధ్యక్ష, కార్యద ర్శులు వూసం వెంకటేశ్వర్లు, ఊశం లింగయ్య, గ్రామ పెద్ద ఉషం రామారావుతో పాటు 170 మంది బీఆర్ ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు సోమవారం రాత్రి సమావేశం ఏర్పాటు చేసుకొని రాజీనామాకు సిద్ధమైనట్లు తెలిపారు. రంగాపూర్ గ్రామపంచాయ తీలో మొత్తం సుమారు 760 ఓట్లు ఉంటాయి. ఇందు లో వీరాపూర్ గ్రామంలోనే మేజర్ గా 170 మంది టిఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. వీరాపూర్ గ్రామం నుండి నూట డెబ్భై మంది రాజీ నామా చేస్తే రంగాపూర్ గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. తాజా పరిణామంతో తాడ్వాయి మండల బిఆర్‌ఎస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలినట్లు అవుతుందని చర్చించుకుం టున్నారు. మండలంలోని బీఆర్‌ఎస్ నాయకుల నిరం కుశ వైఖరితో మండలంలో పార్టీ పరిస్థితి దిగజా రున్నట్లు తెలిపారు. వీరాపూర్ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు, తెలంగాణ రాక ముందు నుండి కెసిఆర్ తెలంగాణ ఉద్యమంలో పిలుపునిస్తే ముందం జలో ఉండి విధులు నిర్వహించిన నాయకులు, అసమ్మ తితో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందారు. ఇది జరుగుతే ఎట్టకేలకు తాడ్వాయి బీఆర్‌ఎస్ పార్టీకి తీరని నష్టం జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.