చిత్తనూర్‌ యువక మండలి ఆధ్వర్యంలో శ్రమదానం

– నల్ల బ్యాడ్జీలతో నిరసన
మరికల్‌: మండలంలోని చిత్తనూర్‌ యువక మండలి ఆధ్వర్యంలోఆదివారం నల్ల బ్యాడ్జీలు ధరించి శ్రమదానం చేశారు. పరిసరాల పరిశుభ్రతకు నల్ల రిబ్బన్లతో నిరసన తెలుపుతూ శ్రమ దానం నిర్వహించారు. అనంతరం చిత్తనూరు యువక మండలి సభ్యుడు బోయ నరేందర్‌ మాట్లా డుతూ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ యువకులు, పెద్ద లకు కతజ్ఞతలు తెలిపారు.చిత్తనూర్‌ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకో వడంలో ప్రతి పౌరుడు తన వంతుగా కషి చేయడం హర్షణీయమన్నారు. పరిశుభ్రంగా ఉన్న చిత్త నూరు గ్రామాన్ని కాలుష్యం చేయ డానికి కంకణం కట్టు కొని పారిశ్రామికవేత్తలు చిత్త నూరు శివారులో తలపెట్టిన ఇథనాల్‌ కంపెనీ వల్ల ఇప్పటికే మన్నెవాగు పరిసర ప్రాంతాలు నీటి పొల్యూషన్‌, గాలి పొల్యూషన్‌ తో, పూర్తిగా వాతావరణం ధ్వంసం కావడం జరుగుతున్న వాటిని దష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలకు గుర్తు చేస్తూ చిత్తనూరు ఇథనాల్‌ కంపెనీ తొలగించాలని డిమాండ్‌ చేస్తూ నల్ల రిబ్బన్లతో నిరసన తెలి యజేసినట్లు పేర్కొన్నారు. భవిష్యత్‌ తరాలను నాశనం చేసే ఇలాంటి హాని కర ఫ్యాక్టరీలను గ్రామా ల మధ్య నిర్మించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. చిత్తనూర్‌ ఇథనాల్‌ కంపెనీ రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు హరీష్‌ బాలకష్ణ, చింతలయ్య, యువక మండలి సభ్యులు మురళి, మణి వర్ధన్‌, నరేందర్‌, బోయ నరేందర్‌, నవీన్‌, రవి, రాజ వర్ధన్‌, ఇథనాల్‌ కంపెనీ వ్యతిరేక పోరాట కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.