దిగజారిన పత్రికా స్వేచ్ఛ శ్రీ కాంగ్రెస్‌ విమర్శ

న్యూఢిల్లీ : దేశంలో పత్రికా స్వేచ్ఛ దిగజారిపోతున్నదని కాంగ్రెస్‌ పార్టీ విమర్శించింది. భారత్‌ అధ్యక్షతన జరుగుతున్న జి-20 సమ్మిట్‌కు అమెరికా మీడియాను మోడీ ప్రభుత్వం అనుమతించలేదని ఆరోపించింది. అమెరికా అధ్యక్షులు జో బైడెన్‌ జి-20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు భారత్‌కు తొలిసారి వచ్చారు. అమెరికా జర్నలిస్టులు కూడా బైడెన్‌తో కలిసి ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానంలో శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు. కాగా, జి-20 సమ్మిట్‌ కవరేజ్‌ కోసం వచ్చిన అమెరికా జర్నలిస్టులు జో బైడెన్‌, మోడీని ప్రశ్నించాలని భావించారని కాంగ్రెస్‌ పార్టీ తెలిపింది.