మంథనిలో 30,475 ఓట్ల మెజార్టీతో శ్రీదర్ బాబు విజయం

– అంబరాన్నంటిన కాంగ్రెస్ శ్రేణులు
– డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ , బిఎస్పీ పార్టీలు
– రెండవ స్థానంలో బీఆర్‌ఎస్‌అభ్యర్థి పుట్ట 
– విజయ పత్రాన్ని అందుకున్న దుద్దిళ్ల
నవతెలంగాణ- మల్హర్ రావు:  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మంథని నియోజకవర్గ ఎమ్మెల్యేగా జాతీయ కాంగ్రెస్ కార్యదర్శి, తెలంగాణ మేనిపేస్టో చైర్మన్ దుద్దిళ్ల శ్రీదర్ బాబు 5వ సారి 30,475 ఓట్ల అత్యధిక మెజార్టీతో గెలుపొంది, ఎన్నికల రిటర్నింగ్ అధికారితో విజయం పత్రాన్ని అందుకున్నారు. మంథని నియోజకవర్గంలో 2.36,442 ఓట్లు ఉండగా,1,95,635 ఓట్లు పోలైయ్యాయి. ఇందులో కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీదర్ బాబుకు 1,01,796 ఓట్లు, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పుట్ట మదుకర్ కు 71,321 ఓట్లు, బీజేపీ అభ్యర్థి 5,642 ఓట్లు, బిఎస్పీ అభ్యర్థి చల్లా నారాయణరెడ్డికి 2,878 ఓట్లు, నోటాకు 760 ఓట్లు  పోలైయ్యాయి. అత్యధిక 30,475 ఓట్లతో శ్రీదర్ బాబు ఎమ్మెల్యేగా గెలుపొందగా, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పుట్ట మదుకర్ రెండవ స్థానంలో నిలువుగా బీజేపీ , బీఎస్పీ అభ్యర్థులు సునీల్ రెడ్డి, నారాయణరెడ్డి తోపాటు 19మంది డిపాజిట్లు కోల్పోయారు.14 టేబుళ్లు, 21 రౌoడ్లలో ఓట్ల లెక్కింపు చేశారు.
రికార్డు బ్రేక్…
మంథని సెగ్మేoట్ లో దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఐదోవసారి గెలుపొంది రికార్డు సృష్టించారు. గతంలో పివి నరసింహరావు నాలుగు సార్లు గెలుపొందారు. దుద్దిళ్ల శ్రీపాదరావు మూడుసార్లు గెలుపొందారు. ఇప్పుడు శ్రీదర్ బాబు ఐదుసార్లు గెలుపొంది రికార్డు సృష్టించారు.
అంబరాన్నంటిన కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు..
మంథని ఎమ్మెల్యేగా దుద్దిళ్ల శ్రీదర్ బాబు 5వ సారి భారీ మెజార్టీతో గెలుపొందడంతో మండలంలోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, యూత్ నాయకులు, మహిళ నాయకురాళ్లు, కార్యకర్తలు స్వీట్లు పంచి, బాణా పంచా పెల్సి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య, మండల ఎంపిపి చింతలపల్లి మల్హర్ రావు, భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ ఎస్సిసేల్ అధ్యక్షుడు దండు రమేష్, మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు కొండ రాజమ్మ, ప్రధాన కార్యదర్శి ఏనుగు నాగరాని, సింగిల్ విండో డైరెక్టర్లు ఇప్ప మొoడయ్య, వొన్న తిరుపతి రావు, సంగ్గెం రమేష్, ప్రధాన కార్యదర్శి వేల్పుల రవి, సర్పంచ్ లు జగన్ నాయక్, రాజు నాయక్, జనగామ స్వరూప బాపు, చెంద్రయ్య, మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ జంగిడి శ్రీనివాస్, మాజీ ఎంపిపి ఇస్నపు రవి, నాయకులు భోగే మల్లయ్య, కేశారపు చెంద్రయ్య, ప్రభాకర్, బొబ్బిలి రాజు, జంగిడి శ్రీనివాస్, ఏనుగు లక్ష్మీ నారాయణ, చిగురు సదయ్య పాల్గొన్నారు.