నిస్సిగ్గు!

ఏడున్నర దశాబ్దాలుగా
జగమంతా గర్వపడేలా
జాతి గుండె ఉప్పొంగేలా
త్రివర్ణపతాకం రెప రెపలాడుతూనే ఉంది!

నిత్యం జెండా ఎగురేసిన మూలస్థంభం
ఎక్కడో ఒక చోట నగంగా ఊరేగుతూ
లోయల్లో ఆదివాసి గూడాలల్లో
పట్ట పగలు కాలి బూడిదై పోతున్నది!

నిప్పు రాజేసిన వాడే
వస్త్రాపహరణం చేసిన వాడే
తనకేమీ పట్టనట్లు కళ్ళు మూసుకుని
మనల్ని సిగ్గు పడమంటున్నడు!

తీరని పదవీ దాహం
జాతికి ప్రాణ సంకటం కావడం
సువిశాల ప్రజాస్వామ్య దేశంలో
చర్చించుకో వీలు లేని విషాదం!

ఇది కౌరవ సభ కాదు
వైవిధ్యమే పునాదైన దేశంలో
విద్వేషాలకు తావుండదు
సహిష్ణుతే సమోజ్వల భవితకు పునాది!

దేశభక్తి నినాదప్రాయం కారాదు
విధానాల్లో వేయి ఆలోచనలై వర్ధిల్లాలి!!

– కోట్ల వెంకటేశ్వర రెడ్డి
9440233261